కొచ్చి : 36 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఇంజన్‌లో ఆయిల్ పరిమాణం వేగంగా తగ్గిపోవడంతో పైలట్లు ఆ ఇంజన్‌ను నిలిపివేశారు. కొచ్చి నుంచి అబుదాబికి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ 737 (ఐఎక్స్ 415)లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంజన్-1లో ఆయిల్ పరిమాణం తగ్గడంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని అబుదాబికి తీసుకెళ్లకుండా కొచ్చికి తిరిగి మళ్లించారు. టేకాఫ్ అయిన సుమారు 50 నిమిషాల తర్వాత సమస్యను గుర్తించిన సిబ్బంది పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. అనంతరం ఇంజన్-1 ఆయిల్ ప్రెజర్ ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో నాన్-నార్మల్ చెక్‌లిస్ట్ ప్రకారం ఇంజన్‌ను నిలిపివేశారు. ఒక ఇంజన్‌తోనే విమానాన్ని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా దిగారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, డిజిసిఎ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.
36 వేల అడుగుల ఎత్తులో విమానం ఇంజన్ నిలిపివేత
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 01:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)