శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజస్థాన్‌లోని కోటాలో దారుణం

2 గంటల క్రితం

రాజస్థాన్‌లోని కోటాలో దారుణం
- కాలువలో మినీ బస్సు పడిపోవడంతో 8 మంది మృతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 10:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కాలువలో మినీ బస్సు పడిపోవడంతో 8 మంది మృతి

జైపూర్‌ : రాజస్థాన్​లోని కోటా జిల్లాలో ఢిల్లీ- ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 17 మంది ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న 20 అడుగుల లోతైన నీటి కాలువలో పడింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని తెలిపారు. కాగా, ప్రయాణికులు ఆర్తనాదాలతో ఘటనా ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కథనం ప్రకారం, మధ్యప్రదేశ్‌కు చెందిన దాదాపు 17 మంది ప్రయాణికులు, భోపాల్‌ నుంచి రాజస్థాన్‌లో ఉన్న ఖాటూ శ్యామ్‌ మందిరానికి వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. వీరంతా శుక్రవారం రాత్రి బేతుల్​ నుంచి బయలుదేరారు. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో సిమాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఆపై పక్కనే ఉన్న 20 అడుగుల లోతైన మురుగు నీటి కాలువలో పడిపోయింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్