న్యూఢిల్లీ: ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, లాల్జీ గోధూ అండ్ కంపెనీల ఉత్పత్తులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలడంతో ఆ సంస్థల ఇంగువ పొడి అమ్మకాలను నిషేధించామని ఆహార నియంత్రణ సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) తెలిపింది.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టు చేసింది. మిశ్రమ ఇంగువ (హింగ్ పౌడర్) నమూనాలు నాసిరకంగా ఉన్నాయని ప్రాథమిక ఆహార ప్రయోగశాల ఫుడ్ అనలిస్ట్ గుర్తించారని పేర్కొంది.
"పసుపు ఇంగువ పొడి (మిశ్రమ ఇంగువ), నలుపు ఇంగువ పొడి (మిశ్రమ ఇంగువ) నమూనాలు కూడా నాసిరకంగా ఉన్నట్లు తేలింది, వీటిలో ఆల్కహాలిక్ ఎక్స్‌ట్రాక్ట్ వరుసగా 3.29 శాతం, 4.4 శాతంగా నమోదైంది," అని తెలిపింది. ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని, తప్పులను సరిదిద్దుకోకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.







కామెంట్‌లు (0)