ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మహారాష్ట్రలో కూలిన నాలుగంతస్తుల భవనం.. 9మందికి చేరిన మృతుల సంఖ్య

1 రోజు క్రితం

Bhiwandi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 11:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : మహారాష్ట్రలోని థానే జిల్లా భివండిలో గురువారం ర్రాతి నాలుగంతస్తుల భవనం కూలిపోయింది. శుక్రవారం ఉదయం మరో మృతదేహాన్ని వెలికితీశామని, దీంతో మృతుల సంఖ్య 9కి చేరిందని మునిసిపల్‌ అధికారులు తెలిపారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన భవనంలో ఒక్కో అంతస్తులో 12 చొప్పున మొత్తం 48 గదులు ఉన్నాయని మునిసిపల్‌ అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. స్థానిక యంత్రాంగం ఈ భవనాన్ని ప్రమాదకరమైనదిగా ప్రకటించింది. భవనంలో మరమ్మత్తు పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. గురువారం రాత్రి 9.00గంటల సమయంలో, భవనం నుండి పెద్ద శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలిపారు. పదేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో పగుళ్లు ఏర్పడడంతో.. దానిని ఖాళీ చేయాల్సిందిగా అక్కడి వారికి ఇది వరకే సూచించినట్లు మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ వారు ఖాళీ చేయకుండా అనధికారికంగా మరమ్మతు పనులు చేపట్టినట్లు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది మరమ్మతు పనులు చేస్తున్న కార్మికులేనని చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్