సుప్రీం కోర్టును ఆశ్రయించిన సుభాష్ చంద్రబోస్ కుమార్తె
న్యూఢిల్లీ : జపాన్ రాజధాని టోక్యోలోని రెంకో-జీ ఆలయం నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను స్వదేశానికి రప్పించాలని కోరుతూ ఆయన కుమార్తె అనితా బోస్ ఫాఫ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర విదేశీ వ్యవహారాలు మంత్రిత్వ శాఖను, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. టోక్యో నుంచి నేతాజీ అస్థికలను స్వదేశం తీసుకొనిరావడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఒక తుది, హేతుబద్ధమైన, కాలపరిమితితో కూడిన నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ధీర్ఘకాలంగా విఫలమవుతోంది’ అని పిటిషన్‌లో అనితా బోస్ తన పిటీషన్‌లో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా నేతాజీ కుమార్తెగా ఆయనకు దేశంలో గౌరవప్రదంగా, తుది అంత్యక్రియలు నిర్వహించలేక పోతున్నాని పిటిషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సుమారు నాలుగు నెలల క్రితం నేతాజీ మనవడు ఆశిష్ రే దాఖలు చేసిన అదే తరహా పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.








కామెంట్‌లు (0)