ముంబయి : మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహీన్ యోజన’ పథకం అమలులో ఆర్థిక నిర్వహణ, బడ్జెట్ నియంత్రణలో తీవ్ర లోపాలు ఉన్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికను ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో సమర్పించారు. ఈ భారీ స్థాయి ఉపసంహరణ, ఆ నిధులు తక్షణ అవసరాలకు వినియోగంచలేదని, వాస్తవ వ్యయ అవసరాలు లేకుండా ఖజానా నుండి బదిలీ చేశారని సూచిస్తోందని తెలిపింది. ఇది తీవ్రమైన ఆర్థిక అవకతవకలుగా అభివర్ణించింది. తక్షణ అవసరం లేకుండా విపిడిఎలలో నిధులను ఉపసంహరించుకోవడం , నిల్వ చేయడం బడ్జెట్ క్రమశిక్షణ, ఆర్థిక సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. ఈ చర్య ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై శాసనపరమైన నియంత్రణను దెబ్బతీస్తుందని కాగ్ హెచ్చరించింది.ఈ పథకం అమలులో "బడ్జెట్ అంచనా, వ్యయ నియంత్రణ మరియు ఆర్థిక నిర్వహణ పరంగా గణనీయమైన లోపాలు" ఉన్నాయని ఆడిట్ నివేదిక పేర్కొంది.
ఈ పథకానికి బడ్జెట్లో రూ.29,693 కోట్లు కేటాయించగా, మహిళా, శిశు సంక్షేమ శాఖ రూ.33,237.24 కోట్లు ఖర్చు చేసింది. దీంతో రూ.3,541 కోట్ల అదనపు వ్యయం జరిగినట్లు కాగ్ వెల్లడించింది. ఈ అదనపు ఖర్చుపై సంబంధిత శాఖ స్పష్టమైన వివరణ ఇవ్వలేదని పేర్కొంది. ఆడిట్ పరిశీలనలో, గత ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య రూ.15,586 కోట్లను వర్చువల్ పర్సనల్ డిపాజిట్ ఖాతాలకు (విపిడిఎలు) బదిలీ చేసినట్లు తేలింది. తక్షణ అవసరం లేకుండానే ఖజానా నుంచి నిధులను ఉపసంహరించి విపిడిఎల్లో నిల్వ చేయడం తీవ్ర ఆర్థిక అవకతవకలకు సంకేతమని కాగ్ వ్యాఖ్యానించింది. ఇటువంటి చర్యలు బడ్జెట్ క్రమశిక్షణ, ఆర్థిక సూత్రాలకు విరుద్ధమని, ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై శాసనసభ నియంత్రణను బలహీనపరుస్తాయని హెచ్చరించింది. అలాగే మహిళా సంక్షేమంపై ప్రభుత్వం చేసే వ్యయం గత ఏడాది రూ.261.78 కోట్ల నుంచి రూ.33,500 కోట్లకు పైగా పెరగడం సంక్షేమ పథకాల కోసం నిధుల భారీ మళ్లింపును సూచిస్తోందని పేర్కొంది. 2024 జూన్ 28న ప్రారంభమైన ఈ పథకం ద్వారా 21 నుంచి 65 ఏళ్ల మధ్య అర్హులైన మహిళలకు నెలకు రూ.1,500ను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డిబిటి) ద్వారా అందిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి భారీ డీబీటీ పథకాల కోసం లబ్ధిదారుల సంఖ్య, అవసరమైన నిధులపై వాస్తవిక అంచనాలతోనే బడ్జెట్ రూపొందించాలని, అనవసరమైన అదనపు వ్యయాన్ని నివారించాలని కాగ్ సూచించింది. అలాగే వీపీడీఏలు వంటి ఖాతాల్లో నిధులను నిల్వ చేయకుండా, వాస్తవ అవసరాలకు అనుగుణంగానే నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
లడ్కీ బహీన్ పథకంలో లోపాలపై కాగ్ ఆగ్రహం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 13, 2026, 12:17 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)