ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

టిఎంసి ఎంపి అభిషేక్‌ బెనర్జీకి కోల్‌కతా హైకోర్టులో ఉపశమనం

30 జులై, 2026

abhishek banerjee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 03:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోల్‌కతా : టిఎంసి ఎంపి అభిషేక్‌ బెనర్జీకి కోల్‌కతా హైకోర్టు ఉపశమనం కల్పించింది. ఆయనపై దాఖలైన మూడు ఎఫ్‌ఐఆర్‌లపై ఎటువంటి బలవంతపు చర్యలు చేపట్టకూడదని పోలీస్‌ అధికారులను కోల్‌కతా హైకోర్టు గురువారం ఆదేశించింది. అభిషేక్‌ బెనర్జీపై ఇప్పటివరకు నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌ల వివరాలతో కూడిన జాబితాను సమర్పించాలని జస్టిస్‌ సౌగత్‌ భట్టాచార్యతో కూడిన సింగిల్‌ బెంచ్‌ ఆదేశించింది. విచారణ సందర్భంగా ఘటన జరిగిన తర్వాత ఫిర్యాదు నమోదు చేయడానికి మధ్య 25 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారని పోలీసులను ప్రశ్నించారు. ఫిర్యాదుదారులు అభిషేక్‌ బెనర్జీకి వ్యతిరేకంగా రెండు సార్లు పోటీ చేశారని, రెండు సార్లు ఓటమి పాలయ్యారని కోర్టు గుర్తించింది. తదుపరి విచారణను ఆగస్ట్‌ 6వ తేదీకి వాయిదా వేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్