ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

హద్దేలేకుండా పెరుగుతున్న సరుకుల ధరలు

2 గంటల క్రితం

hike
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 10:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- చేదెక్కుతున్న చక్కెర

- ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాలు

​న్యూఢిల్లీ : గడచిన రెండేండ్ల కాలంలో దేశవ్యాప్తంగా వంటగది సరుకుల చిల్లర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వినియోగ వ్యవహారాల శాఖకు చెందిన ధరల పర్యవేక్షణ విభాగం నమోదు చేసిన చిల్లర ధరల డేటాను సౌత్ ఫస్ట్ అనే సంస్థ విశ్లేషించింది. 2024-2026 సంవత్సరాల్లో ఆగస్టు 18న నమోదైన ధరలను పరిగణనలోకి తీసుకుంది. కేరళకు సంబంధించిన కొన్ని గణాంకాలు అందుబాటులో లేవు. 2022 ఆగస్టుతో మొదలైన ఐదేండ్ల‌ కాలంలో బియ్యం, పాలు, చక్కెర ధరలు బాగా పెరిగాయని ఆ సంస్థ తెలిపింది. ఇటీవలి కాలంలో పొద్దుతిరుగుడు నూనె ధర కూడా చాలా ఎక్కువగానే ఉంటోంది. కిలో పొద్దుతిరుగుడు నూనె ధర ఈ నెల్లో రూ.192.73కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్నాటక, తమిళనాడు, రాష్ట్రాల్లో సగటు ధర కిలోకు రూ.114 నుంచి రూ.192కి పెరగడం గమనార్హం.

రెండేండ్లలో భారీ పెరుగుదల

పంచదార నిత్యావసర సరుకులలో ముఖ్యమైంది, సంప్రదాయ వంటకాల్లో ఇది అంతర్భాగం. అయితే పండగల సీజన్‌ ‌సమీపిస్తున్న తరుణంలో చక్కెర చేదుగా మారుతొంది. 2022-2026 ఆగస్టు నెలల మధ్య కాలంలో ఎపిలో కిలో చక్కెర ధర రూ.45కుయ చేరుకుంది. బ్రాండెడ్‌ ‌చక్కెర రూ.60 పైగానే అమ్ముతున్నారు. దాదాపు నెలరోజుల్లో 15 శాతం పెరిగింది. మొత్తంగా చూస్తే నాలుగు రాష్ట్రాల్లో కిలో చక్కెర ధర 2025 - 2026 మధ్యకాలంలో సగటున రూ.44.18 నుంచి రూ.50.23కు చేరింది. ధనియాల విషయానికి వస్తే 2024-2026 మధ్యకాలంలో భారీ పెరుగుదల కన్పిస్తోంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో సగటు ధర కిలోకు రూ.25 నుంచి రూ.42కి పెరిగింది. పొద్దుతిరుగుడు నూనెతో పోలిస్తే చక్కెర ధరల పెరుగుదల ఎక్కువ కాలం కొనసాగింది. అయితే, కందిపప్పు, ఎండుమిర్చి, పసుపు ధరలు తగ్గాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్