మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 66 కొత్త విమానాశ్రయాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశీయ విమానయాన రంగాన్ని మరింత విస్తరించడంతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అనుసంధానతను పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఢిల్లీలో జరిగే రూట్స్ ఆసియా 2027 కర్టెన్ రైజర్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. భారత్ మూడో అతిపెద్ద గ్లోబల్ ఏవియేషన్ మార్కెట్‌గా ఎదగడమే లక్ష్యమని చెప్పారు. 2027 మార్చి 16–18 తేదీల్లో నిర్వహించే సదస్సులో 115 విమానయాన సంస్థలు, 55 దేశాలు పాల్గొననున్నాయని తెలిపారు. కొత్త ప్రాంతీయ, అంతర్జాతీయ విమాన మార్గాల ఏర్పాటుకు ఈ సదస్సు దోహదపడుతుందని చెప్పారు.








కామెంట్‌లు (0)