న్యూఢిల్లీ : వికలాంగులపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ కమెడియన్ సమయ్ రైనా, మరో నలుగురిపై దాఖలైన క్రిమినల్ కేసులను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. వికలాంగులకు వారి హక్కుల పట్ల అవగాహన కల్పించడంలో, వికలాంగుల గౌరవాన్ని ప్రోత్సహించడంలో వారు చేస్తున్న కృషిని అతున్నత కోర్టు ప్రశంసించింది. రైనాతో పాటు విపుల్ గోయల్, బల్ రాజ్ పరమజీత్ సింగ్ ఘాయ్, సోనాలి థక్కర్, నిశాంత్ జగదీష్ తన్వర్‌లపై క్రిమినల్ విచారణను, ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీం కోర్టు రద్దు చేసి, ఈ కేసు ముగిసినట్లు ప్రకటించింది. వికలాంగుల కోసం ఈ ఏడాది మార్చిలో చెస్ టోర్నమెంట్ నిర్వహించడంతో పాటు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు, వికలాంగుల కోసం పనిచేస్తున్న సంస్థల గురించి అవగాహన కల్పించేందుకు వీరు చేసిన కృషిని అభినందించింది. ‘నిజమైన ప్రయత్నాలు జరిగినప్పుడు, సానుకూల ఫలితాలు తప్పకుండా వస్తాయి’ అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జయమల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. గతేడాది ‘ఇండియాస్ గాట్ లేటెంట్' అనే ఆన్‌లైన్ షోలో వికలాంగులపై రైనా, ఇతరులు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎస్‌ఎంఎ క్యూర్ ఫౌండేషన్‌తో పాటు ఇతరులు దాఖలు చేసిన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.
కమెడియన్ సమయ్ రైనాపై క్రిమినల్ కేసులు కొట్టివేత
14 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 12:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)