ముంబయి : ప్రముఖ హేతువాది నరేంద్ర ధబోల్కర్ హత్య కేసులో నిందితుడు సచిన్ అంధూరేకు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. 2024లో సెషన్స్ కోర్టు విధించిన జీవిత ఖైదును కూడా జస్టిస్ సరాంగ్ కొత్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. వీటికి సంబంధించిన వివరణాత్మక ఉత్తర్వులు తెలియాల్సి వుంది. సామాజిక కార్యకర్త గోవింద్ పన్సారే హత్య కేసులో అంధూరే విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ రెండు కేసుల్లోనూ ఆయనకు బెఇయల్ మంజూరైంది.
ప్రముఖ హేతువాది, సంఘ సంస్కర్త అయిన నరేంద్ర ధబోల్కర్ (67) మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని చేపట్టారు. సమాజంలో వేళ్లూనుకుపోయిన చేతబడులు వంటి వాటిని వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర మూఢనమ్మకాల వ్యతిరేక సమితి (ఎంఎఎన్‌ఎస్)ను స్థాపించారు. 2013 ఆగస్టు 20న మార్నింగ్ వాక్‌కి వెళ్లిన ఆయనపై మోటార్‌బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ధబోల్కర్ అక్కడికక్కడే మరణించారు. స్థానిక పోలీసులు ఈ కేసును విచారిస్తుండగా.. 2014లో ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలంటూ ఆయన కుమార్తె ముక్తా ధబోల్కర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సచిన్ అంధూరే, శరద్ కలస్కర్‌లను 2024 మే 10న సెషన్స్ కోర్టు నిందితులుగా నిర్థారిస్తూ జీవిత ఖైదు విధించింది. నిందితులపై కఠినమైన ఉపాచట్టం, ఆయుధాల చట్టం కింద అభియోగాలు మోపినప్పటికీ.. అంధూరే బెయిల్‌పై విడుదల కానున్నారు.








కామెంట్‌లు (0)