సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీ హాస్టల్ భవనం కూలిపోయిన ఘటనలో ఐదుగురు అధికారుల సస్పెండ్

11 గంటల క్రితం

Delhi Building Collapse
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 03:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలో హాస్టల్ భవనం కూలిపోయిన కేసులో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసిడి) డిప్యూటీ కమిషనర్‌తో సహా ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు. భవనం యజమాని హరిరామ్ గుప్తాను రాజస్థాన్‌లోని భివాడిలో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. పాత భవనాన్ని చట్టవిరుద్ధంగా పనిచేయడానికి అనుమతి ఇచ్చినందుకు సస్పెండ్ చేశారు. అక్రమ నిర్మాణాలకు అధికారులు అనుమతి ఇవ్వకూడదని, ఇలాంటి సందర్భాల్లో భవన నిర్మాణ శాఖ బాధ్యత వహిస్తుందని ఎంసిడి కమిషనర్ సంజీవ్ ఖిర్వార్ అన్నారు.
కాగా, ఢిల్లీలోని సత్యనికేతన్‌లో ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఐదు అంతస్తుల భవనం కూలిపోయిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, శిథిలాల నుంచి ఇప్పటి వరకు 12 మందిని బయటకు తీసిన విషయం తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్