న్యూఢిల్లీ : సిఇసి జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలంటూ శాంతియుత ప్రదర్శన చేపడుతున్న సిపిఐ(ఎం) నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. స్థానిక ఎన్నికల కార్యాలయం సమీపంలో శాంతియుతంగా ప్రదర్శన చేపడుతున్న నేతలను ఈడ్చుకెళ్లారు. ఓటర్ల జాబితాల 'ప్రత్యేక సమగ్ర సవరణ' (ఎస్‌ఐఆర్), ఎన్నికల సంఘం తీసుకున్న ఇతర వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై పెరుగుతున్న నిరసనలో భాగంగా ఈ ప్రదర్శనను చేపట్టారు. శాంతియుతంగా ప్రదర్శన చేపడుతున్నప్పటికీ..కేంద్ర బలగాలు, పోలీసులు వారిని అడ్డుకున్నారు. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ, పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, ఆర్. అరుణ్ కుమార్, సీనియర్ నేతలు బృందా కరత్, సుభాషిణి అలీ, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అనురాగ్ సక్సేనా, ఎంపీలు వి. శివదాసన్, ఎ.ఎ. రహీంలను పోలీసులు ఈడ్చుకెళ్లారు. మహిళా నేతలను సైతం ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. అనంతరం వారిని అరెస్టు చేసి అక్కడి నుండి బస్సులో తరలించారు. బస్సులో సైతం నేతలు నినాదాలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ను నిలిపివేయాలని, అన్యాయంగా ఓటు హక్కు కోల్పోయిన వారందరికీ తిరిగి ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ఏకపక్షంగా తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాల అమలుపై ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలోని ఇద్దరు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
సిపిఐ(ఎం) నేతలను ఈడ్డుకెళ్లిన పోలీసులు.. అరెస్ట్
12 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 04:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)