ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మావోయిస్టులు, వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చేవారే ‘దిమాగీ నక్సల్స్’

2 గంటల క్రితం

rijuju
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 09:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- కిరణ్‌ రిజిజు‌ వివరణ

న్యూఢిల్లీ : దిమాగీ (మేధావి) నక్సల్స్‌ వ్యవస్థలో పాతుకుపోయి సమాజానికి ముప్పుగా పరిణమించారంటూ ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోడీ చేసిన ఆరోపణలపై ప్రతిపక్షాలతోపాటు మేధావుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రధాని వ్యాఖ్యలు కేవలం మావోయిస్టులు, వేర్పాటువాదులకు మద్దతు ఇస్తూ భారత రాజ్యాంగాన్ని తిరస్కరించేవారిని ఉద్ధేశించినవేనంటూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం సోషల్‌ ‌మీడియా ఎక్స్‌‌లో పేర్కొన్నారు. "సాయుధ నక్సల్స్ వెళ్లిపోయి ఉండవచ్చు, కానీ దిమాగీ (మేధావి) నక్సల్స్ ఇంకా పొంచి ఉన్నారు. వారిని "గుర్తించి, ఏకాకిని చేయాలి" అని ప్రధాని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అసమ్మతిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని అప్రతిష్ట పాలు చేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు విమర్శించాయి. "ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష నాయకులను దిమాగీ నక్సల్స్ అని అనలేదు" "దిమాగీ నక్సల్స్ అంటే వీళ్లే: 1. మావోయిస్టులకు మద్దతునిస్తూ, భారత రాజ్యాంగాన్ని తిరస్కరించేవాళ్ళు. 2. వేర్పాటువాదులతో నిలబడుతూ, ఆర్టికల్ 370కి మద్దతు ఇచ్చేవాళ్ళు." "4. ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశం నుండి వేరు చేయడానికి కోడి మెడ కోయాలని కోరుకునేవాళ్ళు," అని కిరణ్‌ ‌రిజిజు ఎక్స్‌‌లో పేర్కొన్నారు. ఉగ్రవాద నిరోధక యుఎపిఎ చట్టం కింద ఒక కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విద్యార్థి కార్యకర్త సర్జీల్ ఇమామ్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన పోస్టు చేశారు. ఈ పోస్ట్‌‌లో 1, 2 నెంబర్ల తరువాత 4 పెట్టడాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ పవన్ ఖేరా రిజిజుపై వ్యంగ్యాస్త్రం సంధించారు: "సోదరా కిరణ్ రిజిజు, ముందు మీ లెక్కింపును సరిగ్గా చేసుకోండి, ఆ తర్వాతే మేము సమాధానం ఇస్తాం. 1, 2 తర్వాత 3 వస్తుంది, 4 కాదు." అని పేర్కొన్నారు. ఖేరా వ్యాఖ్యలకు స్పందిస్తూ జైరామ్ రమేష్, "సమస్త రాజకీయ శాస్త్రపు అద్భుతం" అని పోస్టు చేశారు. అంతకుముందు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం 'ఎక్స్‌' ప్లాట్‌ఫామ్‌పై, "నేను ఒక దిమాగీ నక్సల్ అయినందుకు గర్వపడుతున్నాను" అని పోస్ట్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్