- కేంద్ర హోంమంత్రి అమిత్ షా
పనాజీ : గుజరాత్‌లోని అదానీ పోర్టులో పదేపదే భారీ మొత్తంలో పట్టుబడుతున్న డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాలపై నోరు మెదపని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పుడు గొప్పగొప్ప మాటలు చెబుతున్నారు. 2029 నాటికి దేశాన్ని పూర్తిగా డ్రగ్స్ రహితంగా మార్చేస్తామని ఆయన పేర్కొన్నారు. గోవా పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నక్సలిజాన్ని దేశం నుంచి నిర్మూలించామని, అదే రీతిలో మత్తుపదార్థాల ముప్పును కూడా పూర్తిగా తుడిచిపెడతామని చెప్పుకొచ్చారు. 2014 కంటే ముందు మాదకద్రవ్యాలపై పోరాటం చాలా చిన్నగా జరిగేదని, అప్పట్లో దర్యాప్తు ఏజెన్సీలు చిన్న చిన్న నిందితులను పట్టుకోవడంతోనే సరిపెట్టుకునేవన్నారు. అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్‌పై పోరాటాన్ని జాతీయ భద్రతా ప్రాధాన్యతగా తీసుకున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ హయాంలో జమ్మూకశ్మీర్ అభివృద్ధి, ప్రగతి పథంలో పయనిస్తోందని కూడా ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ వేర్పాటువాద భావన గణనీయంగా తగ్గిపోయిందన్నారు.








కామెంట్‌లు (0)