ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉత్తరాఖండ్‌లో 4.9 తీవ్రతతో భూకంపం

07 అక్టోబర్, 2026

uttar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 07:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో మంగళవారం రాత్రి భూకంపం సంభవించింది. చమోలీ జిల్లాలో రాత్రి 10:23 గంటలకు 4.9 తీవ్రతతో భూమి కంపించింది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (NCS) ప్రకారం.. భూకంప కేంద్రం భూమికి 13 కిలోమీటర్ల లోతులో నమోదైంది. భూకంప ప్రభావంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు నోయిడా, గురుగ్రామ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలోనూ ప్రకంపనలు కనిపించాయి. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పలువురు ఇళ్ల నుంచి, ఎత్తైన భవనాల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. తమ అనుభవాలను పలువురు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే, ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా పెద్దఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇదిలా ఉండగా.. మంగళవారం ఉదయం అస్సాంలోనూ భూకంపం సంభవించింది. నాగావ్ జిల్లాలో ఉదయం 4:23 గంటలకు 4.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంప కేంద్రం భూగర్భంలో 33 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్