శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిద్యార్థుల ఆందోళనలకు ‘ఆన్‌‌లైన్‌’ మద్దతు

18 గంటల క్రితం

one more voice
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 07:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ‘వన్‌‌మోర్‌ వాయిస్‌’ను ప్రారంభించిన ఫెయిర్‌‌కోడ్‌

కొచ్చి : ఢిల్లీలోని జంతర్‌‌ మంతర్‌ ‌వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలకు ‘ఆన్‌‌లైన్‌’ వేదికగాను మద్దతు ప్రకటించే అవకాశాన్ని కేరళలోని ఒక సాఫ్ట్‌‌వేర్‌ ‌సంస్థ కల్పించింది. రాష్ర్టంలోని కొచ్చికి చెందిన ఫెయిర్‌కోడ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ 'వన్ మోర్ వాయిస్' అనే వైబ్‌‌సైట్‌‌ను ప్రారంభించింది. ఇందులో ఒక పదం టైప్‌ ‌చేసి తమ మద్దతును తెలియచేయవచ్చు. ఫెయిర్‌కోడ్ సహ వ్యవస్థాపకుడు రజిత్ రామచంద్రన్ దీని గురించి మాట్లాడుతూ రెండు ప్రధాన లక్ష్యాలతో దీన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ‘ఇందులో ఒకటి నిరసనల్లో పాల్గొనాలని అనుకున్నా.. ఢిల్లీకి రాలేకపోతున్న వారిని ఏకం చేయడం. రెండోవది నిరసనలకు దూరంగా ఉన్న ప్రజల్లో ఈ సమస్యపై అవగాహన కల్పించడం’ అని వివరించారు. తమ వెబ్‌సైట్‌ ‌కు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గురువారం రాత్రి ప్రాంభమైన ఈ వెబ్‌సైట్‌లో రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో విద్యార్థుల ఆందోళనలపై ఒక పదాన్ని టైప్ చేయడం. రెండవది తమ పేరు, నివసించే ప్రదేశాన్ని టైప్‌ ‌చేయడం. అయితే ఈ రెండోదాన్ని ఖాళీగా కూడా వదిలివేయవచ్చు. ఈ వెబ్‌‌సైట్‌‌కు మంచి స్పందన వస్తోందని, శుక్రవారం సాయంత్రం వరకూ 1369 మంది తమ మద్దతును తెలిపారు. అలాగే ‘టుగైదర్‌’, ‘జస్టిస్‌’, ‘జవాబుదారీతనం’, ‘సంఘీభావం’ వంటి పదాలతో వీరు మద్దతును తెలిపినట్లు వెబ్‌‌సైట్‌ ‌నిర్వాహకులు వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్