శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐఐటి బొంబాయి హాస్టల్‌లో అగ్నిప్రమాదం

56 నిమిషాల క్రితం

iit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 08:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఐదుగురికి గాయాలు

ముంబై: గ్యాస్ లీకేజీ కారణంగా ఐఐటి బొంబాయి హాస్టల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఇద్దరు విద్యార్థులతో సహా ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని అన్ష్ అహిర్వార్ (12), తహసీబ్ ఆలం (9), ఈశ్వర్ సింగ్ (37), శివకుమార్ సింగ్ (34) మరియు అనిల్‌కుమార్ యాదవ్ (23) గా గుర్తించారు. గురువారం రాత్రి సుమారు 10.30 గంటలకు పోవైలోని క్యాంపస్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పైపు లీక్ అవ్వడమే ఈ అగ్నిప్రమాదానికి కారణం. పోలీసులు, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని భవనం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఘట్‌కోపర్‌లోని రాజవాడి ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం, వారిలో నలుగురిని కస్తూర్బా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారందరి ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్