సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మహారాష్ట్రలో 100మందికి పైగా విద్యార్థులకు ఫుడ్‌ పాయిజనింగ్‌

1 గంట క్రితం

Food poisoning
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 04:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగా సుమారు వందమందికి పైగా గిరిజన విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

వివరాల ప్రకారం.. జిల్లాలోని మూడు రెసిడెన్షియల్‌ పాఠశాలలకు చెందిన 100మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం ధర్నిలోని ఒక రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 69మంది విద్యార్థులు భోజనం చేసిన వెంటనే వాంతులు చేసుకున్నారు. పరిస్థితి విషమించడంతో వెంటనే వారిని ధర్ని ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ధర్ని తహసీల్‌లోని బిజుదావ్డి, సావ్లిఖేడాల్లో ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని 70 మంది విద్యార్థులు కూడా అస్వస్థతకు గురయ్యారని, వెంటనే వారిని ఆస్పత్రికి తరలిఒంచామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో చాలా మంది పిల్లలు డిశ్చార్జ్ అయ్యారని అన్నారు. 32మంది విద్యార్థులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై పాఠశాలలకు భోజనం సరఫరా చేసే నిర్వాహకునిపై కేసు నమోదు చేసినట్లు గిరిజన అభివృద్ధి ప్రాజెక్ట్‌ అధికారి (దర్శి) సిద్ధార్థ్‌ శుక్లా తెలిపారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్