సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజ్యసభ మాజీ సభ్యులు హెచ్‌ హనుమంతప్ప మృతి

17 గంటల క్రితం

passed away
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 10:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చిత్రదుర్గ: జాతీయ సిల్కు బోర్డు మాజీ ఛైర్మన్‌, రాజ్యసభ మాజీ సభ్యులు హెచ్‌ ‌హనుమంతప్ప (94) ఆదివారం నాడు మృతి చెందారు. కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన ఆయన కొంతకాలంలో వయో సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చికిత్స కోసం బెంగళూరు తీసుకెళ్తుండగా, మార్గమధ్యలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను తుమకూరులోని సిద్దగంగ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హనుమంతప్ప మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ ‌సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు సోనియా గాంధీలకు అత్యంత సన్నిహితులుగా హనుమంతప్పకు పేరుంది. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉపాధ్యక్షులుగా సేవలందించిన ఆయన 1982–1988, 1988–1994, 1994–2000 మధ్య వరుసగా మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. సెంట్రల్ రైల్వే బోర్డు, సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఛైర్మన్‌గానూ పనిచేశారు. 1995–1998 మధ్యకాలంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గానూ విధులు నిర్వహించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్