కొల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌పై ఆదివారం నాడు కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం..పలువురు నిరసనకారులు ఆమె వాహనంపై రాళ్లు, చెప్పులు విసరడంతో పాటు బురద చల్లారు. అయితే ఈ దాడిలో తన ప్రాణాలు పోయేవని మమతా బెనర్జీ పేర్కొన్నారు. బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో పోలీస్ కస్టడీలో మరణించిన తృణమూల్ కార్యకర్త బిర్జు కెయోట్ కుటుంబాన్ని కలిసేందుకు మమతా బెనర్జీ హలిసహర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఆమెకు నిరసన సెగ ఎదురైంది. కొంతమంది వ్యక్తులు మమతా బెనర్జీ వాహనాన్ని చుట్టుముట్టారు. ఇటుకలు, రాళ్లతో ఆ వాహనంపై దాడి చేశారు. దానిపై బురద కూడా చల్లారు. ‘దొంగను తరిమికొట్టండి’ , ‘బందిపోటు రాణిని తరిమేయండి’ అన్న నినాదాలు కూడా వినిపించాయి. కాగా, తన వాహనంపై దాడి తర్వాత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ఈ దాడిలో తాను ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదురైందని ఆమె ఆరోపించారు. తనపై ఇటుకలు, రాళ్లు పడి ఉంటే ప్రాణాలు కోల్పోయే దానినని అన్నారు. ‘పోలీసుల ముందే బయటి నుంచి వచ్చిన సంఘవిద్రోహులు నా కారుపై రాళ్లు విసిరారు. నా కారు కిటికీలు మూసి ఉండకపోతే, ఆ ధాటికి నా తల పగిలిపోయేది. నేను చనిపోయి ఉండేదాన్ని. ఇంతటి దాడిని నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు. మమ్మల్ని కాపాడటానికి పోలీసులు ఏమీ చేయలేదు. వాళ్లు కేవలం బిజెపికి మాత్రమే రక్షణ కల్పిస్తారు’ అని ఆమె ఆరోపించారు. మమతా బెనర్జీ వెంట ఉన్న లోక్‌సభ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, రాజ్యసభ ఎంపీ డోలా సేన్ కూడా బిజెపి ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌పై దాడి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 12:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)