సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఇసిని తొలగించాలంటూ నిరసన.. గౌరవ్‌ గొగోయ్‌ అరెస్ట్‌

2 రోజుల క్రితం

assam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 05:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గువహటి : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేష్‌ కుమార్‌ను తొలగించాలంటూ నిరసన చేపట్టిన రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, సీనియర్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌ను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. రాజీవ్‌ భవన్‌ నుంచి గొగోయ్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ నాయకులు ర్యాలీగా బయలుదేరి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ సిఇసి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాజీవ్‌ భవన్‌ సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు గొగోయ్‌తో పాటు పలువురు నాయకులు ప్రయత్నించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. గొగోయ్‌తో పాటు ఎఐసిసి కార్యదర్శి మనోజ్‌ చౌహాన్‌, సేవాదళ్‌ అధ్యక్షుడు దీప్‌ బయాన్‌, ఎపిసిసి ప్రధాన కార్యదర్శి ఉదిత్‌ భాను దాస్‌ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్‌ ప్రతినిధి బెదాబ్రత బోరా మాట్లాడుతూ.. ఆందోళన చేపడుతున్న నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అని మండిపడ్డారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్