శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సిజెపి నిరసనలకు దిగివచ్చిన కేంద్రం

1 గంట క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 10:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) నేతృత్వంలో విద్యార్థులు చేపడుతున్న నిరసనకు కేంద్రం దిగివచ్చింది. తటస్థ వేదికపై (పబ్లిక్‌ గ్రౌండ్) చర్చలు జరిపేందుకు కేంద్రం అంగీకరించిందని సిజెపి శుక్రవారం వెల్లడించింది. విద్యార్థుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా సహా తమ డిమాండ్లను ముందుకు తీసుకువెళ్తామని సిజెపి పునరుద్ఘాటించింది. చర్చలు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో జరగనున్నాయని సిజెపి ప్రధాన ప్రతినిధి సౌరవ్‌దాస్‌ పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు జె.పి.నడ్డా, జితేంద్ర సింగ్‌ సమావేశం అనంతరం మేదాంత ఆస్పత్రిలో సోనమ్‌వాంగ్‌చుక్‌ శుక్రవారం తెల్లవారుజామున తన 26 రోజుల నిరవధిక నిరాహారదీక్ష‍ను విరమించిన సంగతి తెలిసిందే. అనంతరం సిజెపి ప్రధాన ప్రతినిధది సౌరవ్‌ దాస్‌ మాట్లాడారు. తటస్థ వేదికపై చర్చలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. మొదటి రోజు నుండి తాము వినిపిస్తున్న ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఉంచుతామని సిజెపి ప్రతినిధి వైష్ణవి గౌర్‌ పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా, బాధితుల కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నీ ఉపసంహరించుకోవాలి అని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్