ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉమర్‌ ఖలీద్‌ పిటిషన్‌పై ఢిల్లీ పోలీసుల స్పందన కోరిన హైకోర్టు

31 జులై, 2026

Umar Khalid
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 12:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో తన మూడవ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ మాజీ జెఎన్‌యు విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం పోలీసులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని జస్టిస్ ప్రతిభా ఎం. సింగ్, జస్టిస్ వికాస్ మహాజన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. ప్రత్యుత్తరం దాఖలు చేయడానికి ఖలీద్‌కు మరో రెండు వారాల గడువు ఇచ్చింది. షార్జీల్‌ ఇమామ్‌ దాఖలు చేసిన ఇటువంటి మరో అప్పీల్‌తో కలిపి ఆగస్టు 27న విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం ఆదేశించింది.

ఉమర్‌ ఖలీద్‌కు బెయిల్‌ నిరాకరిస్తూ ట్రయల్‌ కోర్టు జులై 4న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వ్యతిరేకంగా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) చట్టంలోని సెక్ష‍న్‌ 21కింద ఈ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు ఆయన తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది త్రిదీప్‌ పైస్‌ కోర్టుకు తెలిపారు. ఖలీద్‌ మధ్యంతర బెయిల్‌ కోరారని అన్నారు.

అదే ట్రయల్ కోర్టు ఉత్తర్వుపై షార్జిల్ ఇమామ్‌ దాఖలు చేసిన అప్పీల్‌ ఆగస్టు 27న విచారణకు రానుందని, ప్రస్తుత పిటిషన్‌ను దానితో జతచేయాలని సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు కోర్టుకు తెలిపారు. ఈ వాదనలను నమోదు చేసుకున్న కోర్టు, ప్రధాన పిటిషన్‌, మధ్యంతర బెయిల్ దరఖాస్తు రెండింటిపై నోటీసులు జారీ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్