ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

2 గంటల క్రితం

acident.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 07:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు

  • రాజరప్పకు వెళ్తుండగా స్కార్పియో ప్రమాదం

  • మరొకరికి గాయాలు

రాంచీ: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. బీహార్‌ నుంచి రాజరప్పకు యాత్రికులతో వెళ్తున్న స్కార్పియో వాహనం ఆదివారం తెల్లవారుజామున రాంచీ-పాట్నా జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-33)పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

బీహార్‌లోని నలంద జిల్లా జంఘారో గ్రామానికి చెందిన 14 మంది స్కార్పియోలో రాజరప్పకు బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో రామ్‌గఢ్‌ జిల్లాలోని జాతీయ రహదారి 33పై వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ధ్వంసమైన వాహనం నుంచి బాధితులను బయటకు తీసి, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్