బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జేఎన్‌యూ విద్యార్థుల 17 రోజుల నిరాహార దీక్ష విరమణ

5 గంటల క్రితం

PTI10_14_2026_000272A.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 07:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థుల సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) చేపట్టిన 17 రోజుల నిరవధిక నిరాహార దీక్ష ముగిసింది. విద్యార్థి సంఘం నాయకులపై విధించిన బహిష్కరణను రద్దు చేయడంతో పాటు, విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకునేందుకు యూనివర్సిటీ యాజమాన్యం అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్‌ 19న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. మెరిట్‌ కమ్‌ మీన్స్‌ ఉపకార వేతనాన్ని 25 శాతం పెంచే అంశాన్ని పరిశీలించడంతో పాటు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోనున్నారు. అన్ని హాస్టళ్లలో రెండు వారాల్లో గీజర్లను పనిచేసేలా చేయడం, గ్రంథాలయాల పనివేళలను రాత్రి 9 గంటల వరకు పొడిగించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థుల డిమాండ్ల అమలుపై చర్చించేందుకు 14 రోజుల అనంతరం కమిటీ మరోసారి సమావేశం కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్