సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పంజాబ్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అశ్వని కుమార్‌ మిశ్రా ప్రమాణం

14 గంటల క్రితం

Justice Ashwani
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 12:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చండీగఢ్‌ : పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అశ్వని కుమార్‌ మిశ్రా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్‌లోని లోక్‌భవన్‌లో పంజాబ్‌ గవర్నర్‌ గులాబ్‌ చంద్‌ కటారియా ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్‌ మిశ్రా జూన్‌ నుంచి ఈ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హర్యానా ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైని,గవర్నర్‌ అషిమ్‌ కుమార్‌ ఘోష్‌, అసెంబ్లీ స్పీకర్‌ హర్విందర్‌ కళ్యాణ్‌, అకాలీ ఎమ్మెల్యే గనీవ్‌ కౌర్‌ మజీతియా, పంజాబ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎ.పి. సిన్హాలు హాజరయ్యారు. అయితే జస్టిస్‌ మిశ్రా నియామకాన్ని వ్యతిరేకించిన పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కార్యక్రమానికి హాజరుకాలేదు.


సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్‌ మిశ్రాను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసిన సుమారు నెల రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 5న ఆయన నియామకాన్ని నోటిఫై చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను పరిష్కరించే వరకు ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేయాలని కోరుతూ పంజాబ్‌ కేబినెట్‌ ఆదివారం తీర్మానం చేసింది. అయినప్పటికీ ఈ కార్యక్రమం జరగడం గమనార్హం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్