చంఢీగడ్ : బాబ్రీ మసీద్ ఏకసభ్య విచారణ కమిషన్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ మన్మోహన్ సింగ్ లిబర్‌హాన్ కన్నుమూసారు. 87 ఏళ్ల లిబర్‌హాన్ ఆదివారం చండీగఢ్‌లో తుదిశ్వాస విడవగా, సోమవారం అంత్యక్రియలను నిర్వహించారు. ఈ వివరాలను పంజాబ్- హర్యానా హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రోహిత్ సుద్ మీడియాకు తెలిపారు. 1964లో పంజాబ్- హర్యానా హైకోర్టులో న్యాయవాద వృత్తితో లిబర్‌హాన్ తన కెరీర్‌ను ప్రారంభించారు. 1987 ఫిబ్రవరి 11న ఈ హైకోర్టులో జడ్జీగా ఉద్యోగన్నతి పొందారు. 1997 జూలై 7న మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తరువాత 1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ బాధ్యతలు నిర్వహించారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపిన కమిషన్‌కు నేతృత్వం వహించడంతో జస్టిస్ ఎంఎస్ లిబర్‌హాన్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
జస్టిస్ ఎంఎస్ లిబర్‌హాన్ కన్నుమూత
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 04, 2026, 12:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)