- వైరల్ వీడియోపై వివరణ
ఇండోర్: సమోసాల కోసం ఓ లోకో పైలట్ రైలును ఆపినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పశ్చిమ రైల్వే వివరణ ఇచ్చింది. ఈ ప్రచారం పూర్తిగా అసత్యమని తెలిపింది. సమోసాలు కొనడం కోసమే లోకో పైలట్ రైలును ఆపలేదని పేర్కొంది. ముందున్న ట్రాక్‌పై జరుగుతున్న ఇంజినీరింగ్ పనుల కారణంగా అధికారులు ఈ రైలును సిగ్నల్ వద్ద నిలిపేశారని తెలిపింది. ఆ సమయంలోనే అసిస్టెంట్ లోకో పైలట్ రైలు నుంచి దిగి సమోసాలు కోనుగోలు చేశాడని వెల్లడించింది. అధికారికంగా అనుమతించిన చోట రైలు ఆగినప్పటికీ.. ఉద్దేశపూర్వకంగా కొందరు వ్యక్తులు దీనిపై తప్పుడు ప్రచారాలు చేశారని స్పష్టతనిచ్చింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్-మౌ మధ్య నడిచే డెమో రైలు లోకో పైలెట్ సమోసాలు కొనుగోలు చేయడానికి రైలు దిగాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు స్థానికులు లోకో పైలెట్ కేవలం సమోసాల కోసమే రైలు ఆపాడని వ్యాఖ్యానించగా, రైల్వే అధికారులు దీనిపై విచారణకు ఆదేశించి ఫ్యాక్ట్ చెక్ చేసి వివరణ ఇచ్చింది.








కామెంట్‌లు (0)