- భారీ వర్షాలకు అవకాశం
- ఏఐ ఆధారిత వాతావరణ నమూనాలు అంచనా
న్యూఢిల్లీ: దేశంలో నైరుతి రుతుపవనాల వర్షపాతం లోటు కొంతవరకు భర్తీ అయ్యే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. సెప్టెంబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం లేదా తుఫాను ఏర్పడే అవకాశం ఉందని కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి. దీని ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు, మధ్య భారతంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది. AIFS వాతావరణ నమూనా ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి 28 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, బీహార్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించవచ్చని అంచనా. అల్పపీడన వ్యవస్థ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నందున కేరళపై దీని ప్రభావం పరిమితంగా ఉండవచ్చని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.
మరోవైపు సెప్టెంబర్ 15 నుంచి 18 మధ్య రాజస్థాన్‌లోని వాయువ్య ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 25 ప్రాంతంలో వాయువ్య భారతంలో ప్రతి-తుఫాను వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఉత్తర సరిహద్దు మీదుగా అరేబియా సముద్రం వరకు విస్తరించవచ్చని అంచనా. దీంతో ర కారణంగా వర్షాలు కురుస్తుండగా, మరోవైపు నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ ప్రారంభించనున్నాయి. అక్టోబర్ మధ్య నాటికి కేరళ సహా దక్షిణ భారత రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో రానున్న రోజుల్లో దక్షిణ భారతంలో ఈశాన్య రుతుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ వేగవంతం కావచ్చని భావిస్తున్నారు.
ఒకవైపు అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తుండగా, మరోవైపు నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ ప్రారంభించనున్నాయి. అక్టోబర్ మధ్య నాటికి కేరళ సహా దక్షిణ భారత రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో రానున్న రోజుల్లో దక్షిణ భారతంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.








కామెంట్‌లు (0)