గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

డాక్టర్‌ అనిల్‌ మీనన్‌, ప్రశాంత్‌ బి.నాయర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఎం.ఎ.బేబి

3 గంటల క్రితం

NASA astronaut
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 11:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తిరువనంతపురం : తన తొలి అంతరిక్ష యాత్రలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు విజయవంతంగా చేరుకున్న నాసా వ్యోమగామి డాక్టర్ అనిల్ మీనన్‌కు, భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్ కోసం ఎంపికైన గ్రూప్ క్యాప్టెన్ ప్రశాంత్ బి. నాయర్‌కి సిపిఐ(ఎం) ప్రధానకార్యదర్శి ఎం.ఎ.బేబి శుభాకాంక్ష‍లు తెలిపారు. వారికి సోషల్‌మీడియా ఎక్స్‌ వేదికగా ఆయన అభినందనలు తెలిపారు. ‘‘ నాసా వ్యోమగామి డాక్టర్ అనిల్ మెనన్ తన తొలి అంతరిక్ష యాత్రలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు విజయవంతంగా చేరుకున్నారు. వైద్య పరిశోధనలు, సెమీకండక్టర్ క్రిస్టల్స్‌పై కీలక ప్రయోగాలు నిర్వహించనున్న ఆయన మిషన్ చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. ఆయన మిషన్‌ భారతీయ యువతకు ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు సాగాలనుకునే వారికి స్ఫూర్తినివ్వనుంది. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా ఒట్టపాలం కుటుంబ మూలాలు కలిగిన డాక్టర్ అనిల్ మీనన్, అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మలయాళిగా చరిత్ర సృష్టించారు’’ అని పేర్కొన్నారు. అలాగే భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో ఒకరైన గ్రూప్ క్యాప్టెన్ ప్రశాంత్ బి. నాయర్ కూడా అంతరిక్ష ప్రయాణానికి సన్నద్ధమవుతున్నారు. ఆయన కూడా త్వరలో భారత అంతరిక్ష చరిత్రలో మరో కీలక అధ్యాయాన్ని లిఖించనున్న గ్రూప్‌ కెప్టెన్‌ ప్రశాంత్‌ బి.నాయర్‌కు కూడా విజయం చేకూరాలని ఆకాంక్ష‍ించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్