గ్యాంగ్టక్ : సిక్కింలోని గ్యాల్షింగ్ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పలు నివాసాలు ధ్వంసమయ్యాయని అన్నారు. రింబిగ్రామంలో భారీగా నష్టం వాటిల్లిందని అన్నారు. కొండచరియలు విరిగి పడిన ఘటనలో ప్రభుత్వ నివాసాలతో సహా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయని, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయని అన్నారు. సుమారు 38 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అన్నారు. అయితే, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. రింబి గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు.
సిక్కింలో విరిగి పడిన కొండచరియలు
25 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 11:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)