గురువారం, 06 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనీట్‌ పరీక్ష ఆన్‌‌లైన్‌‌లో ..!

2 గంటల క్రితం

neet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 11:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కసరత్తు చేస్తున్నట్లు సుప్రీంకోర్టులో కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ : జాతీయ స్థాయిలో వైద్య కోర్సుల అర్హత, ప్రవేశాలకు సంబంధించిన నీట్‌ యుజిసి పరీక్షను ప్రస్తుతం నిర్వహిస్తున్న పెన్‌, పేపర్‌ ‌పద్ధతి కాకుండా కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (కంప్యూటర్‌ ‌బేస్డ్‌ ‌టెస్టింగ్‌ - సిబిటి) పద్ధతిలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెల్లడించింది. కేంద్ర విద్యా శాఖ మంగళవారం దాఖలు చేసిన ఒక అఫిడవిట్‌‌లో ఈ విషయం తెలిపింది. నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌‌లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా తరువాత ప్రభుత్వం దాఖలు చేసిన తొలి అఫిడవిట్‌ ఇది. ప్రస్తుతం జరుగుతున్న జెఇఇ (మెయిన్స్, అడ్వాన్స్‌డ్) నమూనాలో నీట్‌‌ను కూడా ఒకే దశలో లేదా రెండు దశల సిబిటి పరీక్షగా మార్చే నిర్ణయాన్ని సమీక్షిస్తున్నట్లు ఇందులో ప్రభుత్వం తెలిపింది. ప్రముఖ సాంకేతిక నిపుణులు నందన్ నిలేకని నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సిబిటి మార్పుపై "తుది నిర్ణయం" తీసుకుంటామని మంత్రిత్వ శాఖ తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్