ముంబయి : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) రూ.13 కోట్ల పైగా మోసం చేసిన కుంభకోణానికి సంబంధించి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన కీలక సన్నిహితుడిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి భారత్‌కు రప్పించిన నిందితుడు సందీప్ మిస్త్రీని ముంబయిలో సిబిఐ అదుపులోకి తీసుకుంది. సోమవారం యుఎఇ నుంచి ఎక్స్‌ట్రాడిషన్ ప్రక్రియ పూర్తి కాగా.. మంగళవారం ముంబయిలోని ప్రత్యేక సిబిఐ కోర్టులో అధికారులు అతడిని హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి సిబిఐ కస్టడీ కోరకపోవడంతో కోర్టు అతనికి అక్టోబర్ 6 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గతేడాది నవంబర్‌లో ప్రత్యేక కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ఆధారంగా ఈ అరెస్ట్ జరిగింది.
Print Editionనీరవ్ మోడీ సన్నిహితుడు సందీప్ మిస్ర్తీ అరెస్ట్
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 10:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)