శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నీతి ఆయోగ్‌ ఇండెక్స్‌‌ విడుదల

3 గంటల క్రితం

niti
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 12:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ముందంజలో ఉన్న రాష్ట్రాల్లో ఎపి

న్యూఢిల్లీ : నీతి ఆయోగ్ మొట్టమొదటిసారిగా 'ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026'ను విడుదల చేసింది. దేశంలో 28 రాష్ర్టాలు, ఎనిమిది కేంద్రపాలిత పాంత్రాలపై నిర్వహించిన ఒక సర్వే ఆధారంగా శుక్రవారం ఈ ఇండెక్స్‌ను విడుదల చేశారు. 84 అంశాల ఆధారంగా 1,850 మందికి పైగా పెట్టుబడిదారులను సర్వే చేయడంతో పాటు, 165 మంది వాటాదారుల నుండి వచ్చిన సూచనల ఆధారంగా దీన్ని రూపొందించినట్లు నీతి ఆయోగ్‌ ‌తెలిపింది. ఈ ఇండెక్స్‌లో 100కి 56.6 స్కోరుతో గుజరాత్‌, ‌53.7 పాయింట్లతో మహారాష్ర్ట, 53.3 పాయింట్లతో తమిళనాడు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. తరువాత స్థానాల్లో గోవా, ఒడిషా ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలను అగ్రశ్రేణి రాష్ట్రాలుగా పేర్కొన్నారు. ముందంజలో ఉన్న, అభివృద్ధి చెందుతున్న, ఆకాంక్షగల రాష్ట్రాలు అనే విభాగాలను కూడా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ సహా 15 రాష్ట్రాలను ముందంజలో ఉన్న రాష్ట్రాలుగా పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్