శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇజ్రాయిల్‌తో సైనిక సాంకేతిక సహకారం వద్దు

1 గంట క్రితం

israel
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 10:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కాంగ్రెస్‌ను కోరిన పౌర హక్కులు, న్యాయవాద బృందాలు

​వాషింగ్టన్ : అమెరికా - ఇజ్రాయిల్ మధ్య సైనిక సాంకేతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే రక్షణ బిల్లులోని ఓ నిబంధనను రద్దు చేయాలని పలు పౌర హక్కులు, న్యాయవాద బృందాలు కాంగ్రెస్‌ను కోరాయి. ఈ నిబంధన ప్రకారం...సైనిక సాంకేతికత అభివృద్ధిని, ఇతర భాగస్వామ్యాలను వేగవంతం చేయడం ద్వారా ఇరు దేశాల రక్షణ రంగాల మధ్య సహకారాన్ని మరింత పెంచుతారు. ఈ బిల్లు జూలైలో ప్రతినిధులసభ ఆమోదం పొందింది. ఇప్పుడు సెనెట్ ఆమోదం పొందాల్సి ఉంది. 2027 జాతీయ రక్షణ అధికార చట్టంలోని సెక్షన్ 219గా ఈ నిబంధనను పిలుస్తారు. ఇజ్రాయిల్ పరిశ్రమతో ఉమ్మడి భాగస్వామ్యాలు, లైసెన్సింగ్ ఒప్పందాలు, అమెరికా ఆధారిత సహ - ఉత్పత్తి భాగస్వామ్యాల కోసం వ్యవస్థల ఏర్పాటుకు ఇది వీలు కల్పిస్తుంది.

అమెరికాకు చెందిన పౌర హక్కుల బృందాలు, న్యాయవాదులు గురువారం ఉభయ సభల సాయుధ సేవల కమిటీల నేతలకు లేఖలు రాస్తూ ఇజ్రాయిల్ రక్షణ రంగంతో మరింత భాగస్వామ్యం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. సంబంధిత నిబంధనను తొలగించాలని కోరారు. ఈ లేఖపై 56 బృందాల నాయకులు సంతకాలు చేశారు. ఈ బృందాలలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్, పౌర హక్కుల నెట్‌వర్క్, లాయర్స్ గిల్డ్, అరబ్ - యూదుల హక్కుల పరిరక్షణ గ్రూపులు ఉన్నాయి. ‘అమెరికా ప్రయోజనాలు ఇజ్రాయిల్ ప్రయోజనాలతో అంతకంతకూ దూరమవుతున్న వేళ, ఇజ్రాయిల్‌కు బేషరతు మద్దతుపై అమెరికా ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్న వేళ మన రక్షణ`సాంకేతిక వ్యవస్థలో ఇజ్రాయిల్ ప్రభావాన్ని పెంచడం అత్యంత ప్రమాదకరం’ అని వారు ఆ లేఖలో వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్