న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన జంతర్‌మంతర్ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలని, సిఇసి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. జంతర్‌మంతర్ నిరసనలో పాల్గొనాలని ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు కూడా ఈ నిరసనలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే పోలీసులు ఈ నిరసనకు అనుమతి నిరాకరించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అక్టోబర్ 2న సాయంత్రం 4.00గంటలకు ముంబయిలోని శివాజీ పార్క్‌లో ‘జైల్ భరో ఆందోళన్’ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ నిరసన ప్రదర్శనకు కూడా ముంబయి పోలీసలు అనుమతి నిరాకరించారని దీప్కే పేర్కొన్నారు. 2013 బాంబే హైకోర్టు ఉత్తర్వుల దృష్ట్యా శివాజీ పార్క్‌లో సమావేశానికి అనుమతినిచ్చే అధికారం తమకు లేదని ముంబయి పోలీసులు వెల్లడించారని అన్నారు. ముంబయిలో మరో ప్రాంతాన్ని ఎంచుకోవాలని దరఖాస్తుదారు అజింఖ్య షిండేకు సూచించామని చెప్పారు.








కామెంట్‌లు (0)