గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇక న్యాయస్థానంలో పోరాటం

2 గంటల క్రితం

bihar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 07:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- జెన్‌ ఆల్ఫా సంచలనం ఆదిత్య రాజ్‌

పాట్నా : తన తల్లిదండ్రులపై పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో పోరాటం కొనసాగుతుందని బీహార్‌‌లో సంచలనంగా మారిన ఆరేళ్ల జెన్‌ ఆల్ఫా బాలుడు ఆదిత్య రాజ్‌ ‌తెలిపాడు. బీహార్‌‌ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా కొన్ని రోజుల క్రితం పాట్నాలో జరిగిన ఆందోళనలో పాల్గొనడంతో ఆరేళ్ల ఆదిత్య రాజ్‌ ‌దేశవ్యాప్తంగా ఆందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సందర్భంగా ఆదిత్య చేసిన ప్రసంగం కూడా వైరల్‌‌గా మారింది. అయితే ఈ ఘటన తరువాత ఆదిత్య రాజ్‌ ‌తల్లిదండ్రులను బీహార్‌ ‌పోలీసులు వేధింపులకు గురిచేసిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా పాట్నాలోని గర్దినీ బాగ్‌‌లో నిరసన దీక్షకు ఆదిత్య రాజ్‌ దిగాడు. ఎంపి పప్పు యాదవ్‌ ‌హామీతో ఈ దీక్షను సోమవారం రాత్రి విరమించాడు. తల్లిదండ్రులపై పోలీసుల దాడిని కోర్టు దృష్టికి తీసుకుని వెళతానిని ఎంపి హామీ ఇచ్చారని, ఇక తన పోరాటం న్యాయస్థానంలో కొనసాగుతుందని ఆదిత్య రాజ్ వెల్లడించాడు. కాగా, తాజాగా ఒక మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ, బీహార్‌ ‌ముఖ్యమంత్రి సమ్రాట్‌ ‌ చౌదరీతో భేటీని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే భవిష్యత్‌‌లో న్యాయవాది అవ్వాలని ఉందని వెల్లడించాడు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్