మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతిరునల్వేలి బాలికపై గ్యాంగ్‌‌రేప్‌ కేసులో ఒకరికి మరణశిక్ష, ఇద్దరికి జైలుశిక్ష

1 గంట క్రితం

law
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 12:28 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తిరునల్వేలి : మైనర్‌ ‌బాలికపై గ్యాంగ్‌ ‌రేప్‌ ‌కేసులో ఒకరికి మరణశిక్ష విధించగా, మరో ఇద్దరికి వరుసగా 20 ఏళ్ళు, 13 ఏళ్ళు శిక్ష విధిస్తూ పోక్సో కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్‌ ‌కథనం ప్రకారం, తిరునల్వేలికి చెందిన 16 ఏళ్ళ బాధితురాలు 2022లో విలతికుళం వద్ద మునీశ్వరన్‌ (25) అనే పెయింటర్‌‌ను కలిసింది. ఇరువురు పరస్పరం ఫోన్‌‌నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్న తర్వాత రెండు వారాల పాటు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మునీశ్వరన్‌ ఆమెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మీనాక్షిపురంలోని తన సోదరి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

తన స్నేహితులు చిన్నకుట్టి, మురుగేశన్‌లను పిలిచాడు, వారు కూడా ఆమెపై లైంగిక దాడికి దిగారు. బాధితురాలు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు పాళ్యంకొట్టాయ్‌ ‌మహిళా పోలీసు స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. మంగళవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సురేష్‌‌కుమార్‌ ‌తీర్పు చెబుతూ చిన్నకుట్టికి మరణశిక్ష విధించగా, మిగిలిన ఇద్దరికీ 20, 16 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్