రంగంలోకి దిగిన ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ..
కొనసాగుతున్న సహాయక చర్యలు
ఒడిశా తీరానికి సమీపంలోని బంగాళాఖాతంలో శనివారం ఒక భారీ సరుకు రవాణా (కార్గో) నౌక మునిగిపోయింది. పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌక, ఒడిశా నుంచి సింగపూర్‌కు ఇనుప ఖనిజం లోడ్‌తో వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో నౌకలో 24 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు ధ్రవీకరించారు. పారాదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఇండియన్ కోస్ట్ గార్డ్, భారత నౌకాదళం రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. నౌకలోని సిబ్బందిలో ఎక్కువ మంది చైనా జాతీయులను ప్రాథమిక సమాచారం అందుతోంది. సహాయక చర్యల కోసం సమీపంలోని ఇతర నౌకలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.








కామెంట్‌లు (0)