శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజలపై భారీ భారాన్ని మోపుతోంది

5 రోజుల క్రితం

john
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 12:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- అమెరికా ఒత్తిడికి బిజెపి ప్రభుత్వం లొంగిపోయింది

- సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్

​ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : డిజిటల్‌ ‌చెల్లింపులపై ఛార్జీలు చెల్లించాలనే అమెరికా ఒత్తిడికి మోడీ ప్రభుత్వం లొంగిపోయిందని సిపిఎం రాజ్యసభ పక్ష నేత జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. సోమవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ యుపిఐపై ఛార్జీలు విధించాలని అమెరికా వాణిజ్య ప్రతినిధులు పట్టుబట్టిందన్నారు. బ్రెజిల్ ఆ ఒత్తిడికి లొంగలేదని, కానీ భారత్ లొంగిపోయిందన్నారు. దీంతో ప్రజలపై భారీగా పన్నుల భారాన్ని మోపుతొందని తెలిపారు. 2023లో జరిగిన జి-20 సమావేశంలో ప్రధాని మోడి, భారతదేశ యుపిఐని ఒక ఉచిత ప్రజా ప్రయోజనంగా తీసుకువచ్చామన్నారని ఆయన గుర్తు చేశారు. అలాగే, ప్రధానమంత్రి ఇచ్చిన హామీని బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు ఉల్లంఘిస్తోందన్నారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికే ఈ బిల్లును ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు.

రాజ్యసభలో ‘ఆదాయపు పన్ను (సవరణ) ఆర్డినెన్స్’, ‘పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు’పై కూడా ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం లక్ష్యాలు పూర్తిగా విఫలమయ్యాయనే వాస్తవాన్ని ప్రభుత్వం సభలో అంగీకరించాలన్నారు. ‘‘ఈ పన్ను కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే, వ్యాపారులపై పడిన భారం వినియోగదారులపైకి బదిలీ కాకుండా ఉంటుందా?’’ అని ఆయన ఆర్థిక మంత్రిని ప్రశ్నించారు. డిజిటల్ చెల్లింపులు చేసే ప్రజలపై పరోక్షంగా పన్ను విధించాలని ఆర్థిక మంత్రి భావిస్తున్నారని అన్నారు. ‘‘అమెరికా జనాభాకు రెట్టింపు సంఖ్యలో ప్రజలు డిజిటల్ చెల్లింపుల విధానంలో ఉన్నారు’’ అని ఆయన తెలిపారు.​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్