బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రైలు ప్రమాదం నుండి యువకుడిని కాపాడిన పాయింట్స్‌మ్యాన్

13 జులై, 2026

railway
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 10:28 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బెంగళూరు : కర్ణాటకలోని మురుడేశ్వర్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు పట్టాలపై పడిపోగా, అప్రమత్తంగా వ్యవహరించిన కొంకణ్ రైల్వే పాయింట్స్‌మ్యాన్ అతడిని సురక్షితంగా బయటకు లాగి ప్రాణాలు కాపాడాడు. కొచ్చువేలి (కేరళ) నుంచి శ్రీ గంగానగర్ (రాజస్థాన్) వెళ్తున్న రైలు కదలడం ప్రారంభించిన సమయంలో 22 ఏళ్ల ప్రయాణికుడు దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు నియంత్రణ కోల్పోయి ప్లాట్‌ఫాం–రైలు మధ్యనున్న సందులో పడిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పాయింట్స్‌మ్యాన్ గణపతి నాయక్ క్షణాల్లో స్పందించి యువకుడిని బయటకు లాగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మొత్తం స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గణపతి నాయక్ సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలను కొంకణ్ రైల్వే అధికారులు ప్రశంసించారు. ఆయన సేవలను గుర్తిస్తూ కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ రూ.10,000 నగదు బహుమతిని ప్రకటించింది. రైల్వే అధికారులు ప్రయాణికులు కదులుతున్న రైలు ఎక్కడం లేదా దిగడం చేయవద్దని, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్