బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అమిత్‌షా ఆదేశాల మేరకే విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం : రాహుల్‌గాంధీ

6 గంటల క్రితం

Rahul Gandhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 03:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : హోంమంత్రి అమిత్‌షా ఆదేశాల మేరకే పోలీసులు విద్యార్థులపై దౌర్జన్యానికి దిగారని లోక్‌సభ ప్రతిపక్ష‍ నేత రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నిజమైన శత్రువు ఆర్‌ఎస్‌ఎస్‌ అని, దేశ విద్యావ్యవస్థను ఆర్‌ఎస్‌ఎస్‌ తన గుప్పిట్లోకి తీసుకుందని అన్నారు. వాస్తవానికి విద్యాశాఖను ధర్మేంద్ర ప్రధాన్ నిర్వహించడం లేదని, దీంతో ఆయన రాజీనామా పైపై చర్య మాత్రమేనని అన్నారు. విద్యావ్యవస్థను ఆర్‌ఎస్ఎస్‌ తన గుప్పిట్లోకి తీసుకుందని, విద్యార్థులను స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఆలోచించడాన్ని తిరస్కరిస్తుందని అన్నారు. వ్యవస్థ పూర్తిగా ఆర్ఎస్‌ఎస్‌ చేతుల్లోకి వెళ్లిందని, విద్యాశాఖను నడిపే వ్యక్తి మంత్రి కార్యాలయంలో కూర్చున్న ఒక ఒఎస్‌డి (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) మాత్రమేనని ఎద్దేవా చేశారు. విద్యార్థులు తమ ఆసక్తులను అనుసరించకుండా మరియు వ్యవస్థను ప్రశ్నించకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. విద్యార్థులను విద్యార్థులుగా ఉండనివ్వరని, వారి అభిరుచులను అనుసరించనివ్వరని, వారికి అనిపించినది చెప్పనివ్వరని, వారు అడగాలనుకున్న ప్రశ్నలను అడగనివ్వరని అన్నారు. ఇది విద్యార్థుల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ రచించిన అర్థరహిత చరిత్రను విద్యార్థులు తప్పక నమ్మాల్సి ఉంటుందని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ కేవలం ఒక ప్రతీక మాత్రమేనని, అసలైన శత్రువు ఆర్‌ఎస్‌ఎస్‌ అని మండిపడ్డారు. విద్యార్థులను 'అంధభక్తులు'గా మార్చాలని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


పేపర్‌ లీక్‌ వ్యతిరేక బిల్లును ఆమోదించిన లోక్‌సభ

పేపర్‌ లీక్‌ వ్యతిరేక బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లును సభ ఆమోదించింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష‍ నేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్