ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

క్షతగాత్రుల పరామర్శకూ ఆంక్షలు

1 గంట క్రితం

cpm mp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 11:13 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రిలో ఢిల్లీ పోలీసుల అత్యుత్సాహం

- సిపిఎం నేతలను అడ్డుకున్న వైనం

​ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పోలీసుల అమానవీయ దాడిలో గాయపడి‌ చికిత్స పొందుతున్న విద్యార్థులు, యువతను పరామర్శించేందుకు వెళ్లిన సిపిఎం నేతలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. చికిత్స పొందుతున్న వారి వివరాలను అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు ఆసుపత్రి అధికారులు వెల్లడించడం లేదు. అఖరికి పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఢిల్లీ వాసి సాక్షి (21) వివరాలను కూడా బయటకు చెప్పడం లేదు. దీంతో గాయడినవారిని పరామర్శించడానికి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్. అరుణ్‌కుమార్, ఎంపిలు జాన్ బ్రిట్టాస్, ఎఎ రహీం, డివైఎఫ్ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హిమగ్నరాజ్ భట్టాచార్య, కేంద్ర కార్యవర్గ సభ్యుడు జెక్ సి థామస్, ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్ ఎం. సాజి, ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య ఆదివారం వెళ్లారు. గాయపడిన వారి పరామర్శించడంతో పాటు సహాయం అందించడానికి సిపిఎం నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో పాటు ఆసుపత్రి వద్ద కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. ఆర్ఎంఎల్ ఆసుపత్రి కాకుండా ఢిల్లీలోని మరెక్కడ గాయపడిన వారికి చికిత్స జరుగుతోందో కూడా స్పష్టత లేదు. నిరసనలో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేయమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, గాయపడిన వారిని ఆసుపత్రిలోనే నిర్బంధిస్తోంది.

అమిత్ షా రాజీనామా చేయాలి: జాన్ బ్రిట్టాస్

ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు పోలీసులు, అమిత్ షా పూర్తి నియంత్రణలో ఉన్నాయని సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. “ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తలకు కూడా స్వేచ్ఛ లేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను చూడటానికి వారి తల్లిదండ్రులను, బంధువులను గానీ, ఎంపిలను గానీ అనుమతించడం లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. “నిరసన తెలిపిన యువతను గౌరవిస్తానని హోం మంత్రి అమిత్ షా చెపారు. కానీ 20వ తేదీన ఆ గౌరవం ఎక్కడ ఉంది? స్వతంత్ర భారతదేశ చరిత్రలో విద్యార్థులను ఇంత దారుణంగా ఎప్పుడూ కొట్టలేదు. దీనికి బాధ్యుడైన అమిత్ షా రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్