- ఎబివిపి ఫిర్యాదుతో నిర్ణయం
బెంగళూరు: ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో విచారణ లేకుండా ఆరేళ్లుగా జైలులో ఉన్న ఉమర్ ఖాలిద్‌పై రూపొందుతున్న డాక్యుమెంటరీ ప్రదర్శన బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో వాయిదా పడింది. ఏబీవీపీ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. లా అండ్ సొసైటీ కమిటీ ఆధ్వర్యంలో రూపొందుతున్న ‘ఖైదీ నెం. 626710 ఈజ్ ప్రెజెంట్’ అనే డాక్యుమెంటరీని గత శుక్రవారం ప్రదర్శించాల్సి ఉంది. ప్రదర్శన అనంతరం చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. అయితే భద్రతా కారణాలను చూపుతూ డాక్యుమెంటరీ ప్రదర్శనను వాయిదా వేసినట్లు విద్యార్థులకు సమాచారం అందించారు. డాక్యుమెంటరీ ప్రదర్శనను వాయిదా వేయాలని ఏబీవీపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రదర్శనకు కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు.








కామెంట్‌లు (0)