న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి యూనియన్ (డిఎస్‌యు) ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ), ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) నిర్ణయించాయి. ఈ మేరకు రెండు విద్యార్థి సంఘాలు సంయుక్తంగా ఒక ప్రకటనను విడుదల చేశాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఐసాల నేతృత్వంలో సాగిన వరుస విద్యార్థి ఆందోళనల ఫలితంగానే అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని, ఆ పోరాట స్ఫూర్తితోనే ఈ పొత్తు రూపుదిద్దుకుందని నాయకులు పేర్కొన్నారు. ఈ నూతన రాజకీయ చైతన్యం ఇప్పుడు ఢిల్లీ వర్సిటీ క్యాంపస్‌కు విస్తరించిందన్నారు. విద్యార్థుల నిజమైన సమస్యలను అజెండాగా ఎంచుకుని ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐలు ప్రోత్సహిస్తున్న ధన బలం, కండబల రాజకీయాలను ప్రశ్నిస్తూ చేపట్టిన ఈ ప్రచారానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోందని సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.
https://www.facebook.com/photo?fbid=1379268657651744&set=a.320538660191421








కామెంట్‌లు (0)