సుప్రీంను ఆశ్రయించిన ఆరుగురు అభ్యర్ధులు
న్యూఢిల్లీ : నీట్ యుజి పరీక్షకు హాజరైన ఆరుగురు అభ్యర్థులు మంగళవారం సుప్రీంను ఆశ్రయించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) చూపించిన ఓఎంఆర్ సమాధాన పత్రాలు, పరీక్ష సమయంలో తాము మార్క్ చేసిన సమాధానాలతో సరిపోలడం లేదని వారు పేర్కొన్నారు. 600, 650కి పైగా మార్కులు సంపాదించిన ఆ విద్యార్థులు తమ ఫలితాలు ప్రకటించేందుకు ఉపయోగించిన జవాబు పత్రాల కచ్చితత్వంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవడానికి ముందుగానే తమ కేసును విచారించాలని వారు కోరుతున్నారు. అత్యవసర విచారణ నిమిత్తం చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఫలితాల తర్వాతే తేడాలు
అభ్యర్థులు తమ ఒఎంఆర్ షీట్‌లను చెక్ చేసుకుని, ఏవైనా దిద్దుబాట్లు వుంటే చెప్పాల్సిందిగా ఎన్‌టిఎ అబ్జక్షన్ విండోను ప్రారం భించినపుడు ఈ అంశం తమకు కనబడలేదని పిటిషనర్లు తెలిపారు. దీనివల్ల అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తంచేయడానికి ఇచ్చిన గడువులోపల ఈ వివాదాస్పద ఎంట్రీలను సవాలు చేసేందుకు తమకు అవకాశం లేకుండా పోయిందని పిటిషనర్లు వాదించారు. ఈ అంశంపై ఎన్‌టిఎను కలిశారా అని విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. విద్యార్థులు ఇ మెయిల్స్ పంపారని, ఎన్‌టిఎ కార్యాలయానికి కూడా వెళ్ళారని, కానీ వారికి సంతృప్తికరమైన సమాధా నాలు రాలేదని న్యాయవాది చెప్పారు. సుప్రీం కోర్టుకు వెళ్లండని అక్కడ ఎన్‌టిఎ అధికారులు చెప్పారని అన్నారు. ఒఎంఆర్ షీట్‌లపై అభ్యంత రాలను విద్యార్ధులు నమోదు చేశారా లేదా అని ఆ బెంచ్‌లో వున్న జస్టిస్ జోమాల్యా బాగ్చి ప్రశ్నించారు. దానిపై లాయర్ స్పందిస్తూ, ఆ దశలో అభ్యర్ధులకు ఈ వివాదా స్పద ఒఎంఆర్ షీట్లు కనబడలేదని, అందువల్ల వారు అభ్యంత రాలు తెలియచేయలేకపోయారని చెప్పారు.








కామెంట్‌లు (0)