- భవన యజమానులకు కాంగ్రెస్ సర్కార్ షాక్
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ప్రజలు నుండి సాఫ్ట్‌వేర్ పన్నును వసూలు చేస్తుంది. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఆస్తిపన్ను రసీదుల్లో ‘సాఫ్ట్‌వేర్ ఛార్జీలు’ పేరుతో కనిపిస్తున్న ఈ రుసుము నివాస భవనాలపై ఏడాదికి రూ.200, వాణిజ్య భవనాలపై రూ.1,000గా ఉంది. సాఫ్ట్‌వేర్, డిజిటల్ వ్యవస్థల కోసం భవన యజమానులు ప్రత్యేకంగా ఎందుకు పన్ను చెల్లించాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏడాది ప్రారంభంలో ఈ పన్ను వసూలు చేయలేదని, ఆర్థిక సంవత్సరం మధ్యలో వసూలు చేయడం తగదని బెంగళూరు వాసులు వాపోతున్నారు. కానీ గ్రేటర్ బెంగళూరు అథారిటీ సమర్థించుకుంది. నగరంలో డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణం, నిర్వహణ, అభివృద్ధి వ్యయాన్ని భరించేందుకే ఈ పన్నును విధించామంది. ‘‘ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలంటే ప్రపంచ స్థాయి సాఫ్ట్‌వేర్, ఐటి మౌలిక సదుపాయాలు అవసరం. నాణ్యమైన డిజిటల్ సేవలు రూపొందించడానికి, నిర్వహించడానికి అధికంగా డబ్బు ఖర్చవుతుంది. నివాస భవనాలకు ఏడాదికి కేవలం రూ.200 మాత్రమే. ఇది చాలా స్వల్పం’’ అని జిబిఎ ప్రత్యేక కమిషనర్ మౌద్గిల్ తెలిపారు.








కామెంట్‌లు (0)