న్యూఢిల్లీ : భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) అధ్యక్షుని పేరుతో సిఇసి జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా అధికారాన్ని వినియోస్తున్నారని, ఆయనను తొగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను త్వరగా విచారణకు జాబితా చేసేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఎదుట హాజరైన పిటిషనర్ రాకేష్ కుమార్ సింగ్ తరపు న్యాయవాది వికాస్ సింగ్, ముదిత్ గుప్తా, ఈ పిటిషన్‌ను త్వరగా విచారించాలని మౌఖికంగా ప్రస్తావించారు. పిటిషన్‌పై తుది విచారణ జరిగే వరకు జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్ విధులను నిర్వహించకూడదని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను వచ్చే వారం విచారణకు చేపట్టేందుకు సిజెఐ అంగీకరించారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఏకాభిప్రాయ నిర్ణయాల ద్వారానే భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) కార్యకలాపాలను నిర్వహించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
సిఇసిని తొలగించాలన్న పిటిషన్‌పై విచారణకు సుప్రీం ఓకే
16 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 12:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)