న్యూఢిల్లీ : సంభాల్ హింసాకాండకు సంబంధించిన కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఈ కేసులో నిందితుడు ముల్లా అఫ్రోజ్‌పై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) కింద విధించిన ముందస్తు నిర్బంధ ఉత్తర్వును సుప్రీంకోర్టు మంగళవారం రద్దు చేసింది. ఈ ఎన్‌ఎస్‌ఎను "చట్టవిరుద్ధంగా వినియోగించారని" పేర్కొంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 10 లక్షల జరిమానా విధించింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌ఎస్‌ఎ కింద సంబంధిత వ్యక్తి స్వేచ్ఛను హరించే ముందు అధికారులు తగిన అంశాలను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమయ్యారని ధర్మాసనం విమర్శించింది. కేవలం నేరాంగీకార వాంగ్మూలం ఒక్కదానితోనే ముందస్తు నిర్బంధాన్ని అధికారులు విధించలేరని ధర్మాసనం స్పష్టం చేసింది.
Print Editionయుపి సర్కార్‌కు సుప్రీం షాక్
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 10:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)